జనగామ రూరల్: పాడి పశువుల పోషణపై రైతులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.ఎస్.మురళీధర్ రావు సూచించారు. బుధవారం జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో పీఎండీడీకేవై కార్యక్రమంలో భాగంగా ‘పాడిపశువుల పోషణలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు’ అనే అంశంపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పశువుల పోషణలో సమతుల్య దాణా, పచ్చిమేత, ఎండుమేత, ఖనిజ లవణా లు పరిశుభ్రమైన తాగునీటి ప్రాముఖ్యాన్ని వివరించారు. మామునూరు శాస్త్రవేత్తలు సాయికిరణ్, విజయ్‌భాస్కర్ పాడి పశువుల పోషణలో పాటించాల్సిన శాసీ్త్రయ మెలకువలు, సమతుల్య దాణా తయారీ, పచ్చిమేత సాగు, పశువుల ఆరోగ్య పరిరక్షణ పాల ఉత్పత్తి పెంపుదలకు అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లు డాక్టర్ అశోక్, దేవేందర్, రవిప్రసాద్, జనగామ మండల పశువైద్యాధికారులు డా. శ్రీకాంత్, డా.నితిన్‌కుమార్, లింగాలఘణపురం మండల పశువైద్యాధికారి డా. జితేందర్ పాల్గొన్నారు.


