హామీలు వెంటనే అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

హామీలు వెంటనే అమలు చేయాలి

Nov 11 2026 1:07 AM | Updated on Nov 11 2026 1:07 AM

జనగామ రూరల్‌: ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ కోరారు. మంగళవారం పట్టణంలో ఉమాపతి భవన్‌లో ఎం.గణేష్‌ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. పీఆర్సీ రిపోర్ట్‌ వెంటనే తెప్పించుకుని అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ దానిపై స్పందించడం లేదని మండిపడ్డారు. అనంతరం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనగామ మండల అధ్యక్షుడిగా ఎం.గణేష్‌, ప్రధాన కార్యదర్శిగా ఎం.శివకుమార్‌, ఉపాధ్యక్షులుగా గాయం రమేశ్‌, వసంత, గోవర్ధన్‌, సత్తిరెడ్డి, కార్యదర్శులుగా రవికుమార్‌, శ్రీనివాస్‌ సాంబరాజు, స్వరూప, ఎల్‌.విజయ్‌ కుమార్‌, జిల్లా కౌన్సిలర్స్‌గా జి.శ్రీనివాస్‌, సత్యవర్ధన్‌ రెడ్డి, మధు, శారదమ్మ, ఉమాదేవి, శ్రీధర్‌ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్‌ ఎన్‌ రాజు, ఎండీ అంకుశావళి తదితరులు పాల్గొన్నారు.

చెకుముకి సైన్స్‌ సంబురాల వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

జనగామ రూరల్‌: విద్యార్థులలో సైన్స్‌పై అభిరుచి, శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేలా జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తోందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు, డాక్టర్‌ వంశీ అన్నారు. మంగళవారం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. టాలెంట్‌ టెస్ట్‌ను పాఠశాల స్థాయి, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలలోని 8,9,10 తరగతులు చదివే విద్యార్థులు పాల్గొనాలని కోరారు. ఈనెల 12న పాఠశాల స్థాయిలో, 21న మండల స్థాయిలో, 28న జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో డిసెంబర్‌ 11,12,13 తేదీల్లో సీఎంఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కండ్లకోయ, మేడ్చల్‌ రోడ్‌ హైదరాబాద్‌లో జరుగుతాయని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 93464 02030, 99512 53676, 95532 42383 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాసాల బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండె కనకయ్య జిల్లా బాధ్యులు పెట్లోజు శోభన్‌ బాబు, బానోతు రవీందర్‌, కాలూరి ఆంజనేయ చారి, సానికె సత్తయ్య, లక్ష్మణ్‌ జి, గూడెల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కట్టారు..కూల్చారు..

● ఇందిరమ్మ నమూనా ఇల్లు పేరిట రూ.5లక్షల ప్రజాధనం వృథా

స్టేషన్‌ఘన్‌పూర్‌: డివిజన్‌ కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో ఏడాది క్రితం రూ.5 లక్షలు వెచ్చించి నిర్మాణం చేపట్టిన ఇందిరమ్మ మాడల్‌ హౌజ్‌ రోడ్డు విస్తరణలో భాగంగా మంగళవారం కూల్చివేశారు. ప్రభుత్వ అఽధికారులు ముందుచూపు లేకుండా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో గృహ నిర్మాణ సంస్థ వారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ నమూనా ఇల్లును రూ.5లక్షలతో ఏడాది క్రితం నిర్మించారు. అయితే నూతన గాంధీ చౌరస్తా నుంచి ప్రభుత్వ ఆస్పత్రి రోడ్డు మీదుగా బస్టాండ్‌ వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణలో భాగంగా ఇందిరమ్మ నమూనా గృహాన్ని పూర్తిగా కూల్చివేశారు. 60 ఫీట్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులు చేస్తుండగా తహసీల్దార్‌ కార్యాలయం ప్రహారీతో ఇందిరమ్మ మాడల్‌ హౌజ్‌ను కూల్చివేశారు. అధికారులు నిర్లక్ష్యంతో ప్రజాధనం వృథా చేశారని డివిజన్‌ కేంద్రంలో విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement