జనగామ: కార్తీక మాసం మొదటి రోజు మంగళవా రం జిల్లా వ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పట్టణంలోని పాత బీటు బజారు శ్రీ రామలింగేశ్వర స్వామి, బాణాపురం అయ్యప్ప స్వామి, బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధులగుట్ట, పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి, జనగామ మండలం చీటకోడూరు శ్రీ పంచకూసు రామలింగేశ్వర స్వామి, చిల్పూరు బుగులు వెంకన్న ఆలయాలతో పాటు జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం, గీ తాశ్రమం, బాణాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి, సాయిబాబా, బతుకమ్మకుంట శ్రీ విజయదుర్గామాత, గణేష్ స్ట్రీట్ గణేష్ టెంపుల్, పోచమ్మ, మహాంకాళమ్మ, శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


