● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
● గార్లగడ్డతండాలో రూ.7,41,743 విలువైన విత్తనాల పట్టివేత
చిల్పూరు: ఎలాంటి అనుమతులు లేకుండా రబీ (యాసంగి) సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని విత్తనా లను అక్రమంగా నిల్వ చేస్తే విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గార్లగడ్డతండాకు చెందిన భూక్య రాజు అనేవ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన 1010, ఆర్‌ఎన్‌ఆర్–15048, కేఎన్‌ఎం, బీపీటీ, ట్రూత్‌ఫుల్, ఫౌండేషన్, బ్రీడర్ సీడ్ 546 బస్తాల వరి విత్తనాలను వ్యవసాయ, రెవెన్యూ, టాస్క్‌ఫోర్స్ బృందం సోమవారం తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారని, వీటి విలువ రూ.7,41,743 ఉందని పేర్కొన్నారు. రబీని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో రైతులకు ధ్రువీకరించిన విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. అక్ర మ నిల్వలు, అనధికార విక్రయాలు, నకిలీ విత్తనా ల సరఫరా అరికట్టేందుకు ప్రతీ మండలంలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్‌శాఖలను నిరంతర తనిఖీలు చేసేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.


