‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ | - | Sakshi
Sakshi News home page

‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’

Nov 8 2026 4:41 AM | Updated on Nov 8 2026 4:41 AM

● పూర్తయిన ఇళ్లకు నేడు స్టిక్కర్లు

లింగాలఘణపురం: రాష్ట్ర ప్రభుత్వం ‘గుడిసెలు లేని తెలంగాణ’ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. అందులో మొదటి విడత మంజూరై ఇళ్లు పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసిన లబ్ధిదారుల ఇళ్ల వద్ద దీపావళి పండుగ రోజు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ అనే కార్యక్రమాన్ని చేపట్టనుంది. అందులో ఇళ్ల ముందు గోడపై ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ అనే లోగోతో కూడిన స్టిక్కర్‌ను అతికించడం, లబ్ధిదారుల వివరాలను పేయిటింగ్‌ చేయడం, ఇంటి ముందు దీపం వెలిగించి కుటుంబ సభ్యులతో ఫొటో తీసి ఇందిరమ్మ ఇళ్ల మొబైల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ప్రతీ గ్రామంలో ఒకటి రెండు ఫొటోలు అప్‌లోడ్‌ చేసి సోషల్‌మీడియాలో పోస్టు చేయాలని సూచించింది. గ్రామ పంచాయతీల్లో ‘ముందు–తర్వాత’ ఇల్లు ఫొటోను ఫ్లెక్సీ ఏర్పాటు చేసి కూడలిలో ప్రదర్శించాలని నిర్దేశించారు. ప్రభుత్వ ప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి గృహనిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులతో సమన్వయం చేస్తూ పూర్తయిన ఇళ్లను సందర్శించి లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement