లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబానికి ‘కొమ్మూరి’ అండ | - | Sakshi
Sakshi News home page

లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబానికి ‘కొమ్మూరి’ అండ

Nov 6 2026 1:26 AM | Updated on Nov 6 2026 1:26 AM

బచ్చన్నపేట : మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబాన్ని గురువారం కాంగ్రెస్‌ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా ప్‌రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌, ప్రభుత్వ విప్‌ వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. వారికి ధైర్యం చెబుతూ ఓదార్చారు. లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు, ఆయన భార్యకు ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొమ్మూరి మాట్లాడుతూ.. ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం జీవితాంతం పోరాడిన ఉద్యమకారుల సేవలను మరువలేమని, వారి కుటుంబాలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవడం మన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చై ర్మన్‌ కొమ్మూరి ప్రశాంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ కొమురవెల్లి, చేర్యాల, బచ్చన్నపేట మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్‌, మంజ మల్లేశం, మసూద్‌, పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రూ.5లక్షల ఆర్థిక సాయం

అందించి ఔదార్యం

ఇందిరమ్మ ఇల్లు, ఉద్యోగం

కల్పిస్తామని హామీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement