ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం దురహంకారం | - | Sakshi
Sakshi News home page

ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం దురహంకారం

Oct 20 2026 1:26 AM | Updated on Oct 20 2026 1:26 AM

● బీఆర్‌ఎస్‌ నాయకుల ఆగ్రహం

జనగామ: బతుకమ్మ వేడుకల్లో ప్రజాప్రతినిధులను వేదికపైకి వెళ్లకుండా అడ్డుకోవడం దురహంకారానికి నిదర్శనమని జనగామ మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్లు పోకల జమున, ప్రేమలతారెడ్డి, వైస్‌ చైర్మన్‌ భూష పర్వతాలు, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ సిద్ధిలిం గం, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సురేష్‌రెడ్డి తదితరులు విమర్శించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.. ప్రజల ఓట్లతో ఎన్నికై న ప్రజాప్రతినిధులను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో వేలాది ప్రజలు ప్రశాంతంగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో, కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి నాయకత్వంలో కొంతమంది వచ్చి అధికారులను, పోలీసులను బెదిరిస్తూ ప్రజాప్రతినిధులను వేదికపైకి వెళ్లకుండా అడ్డుకోవడం శోచనీయమన్నారు. ఇప్పటివరకు వార్డు సభ్యుడిగా కూడా గెలవని, జనగామ ఓటరు కాని ప్రశాంత్‌రెడ్డి ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం, పోలీసులను, అధికారులను బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. జనగామ గడ్డపై రౌడీయిజం, గూండాగిరికి తావులేదని స్పష్టం చేశారు. వేడుకల సందర్భంగా గొడవలు సృష్టించే వారిని అడ్డుకోవడంతో పాటు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సమావేశంలో కౌన్సిలర్లు ఉడుగుల కిష్టయ్య, పానుగంటి సువార్త, సేవెల్లి మధు, గోపగాని సుగుణాకర్‌, నాయకులు మామిడాల రాజు, ఎనగందుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement