కొనసాగుతున్న గ్రాడ్యుయేట్‌ ఓటరు నమోదు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న గ్రాడ్యుయేట్‌ ఓటరు నమోదు

Oct 20 2026 1:26 AM | Updated on Oct 20 2026 1:26 AM

జనగామ: జిల్లా వ్యాప్తంగా గ్రాడ్యుయేట్‌(పట్టభద్రుల) ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కోసం సమర్పించిన ఫారమ్‌–18 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 19వ తేదీ నాటికి మండలాల వారీగా దరఖాస్తుల పెండింగ్‌ నివేదికను వెల్ల డించారు. జిల్లా పరిధిలోని 12 మండలాల నుంచి 13,037 దరఖాస్తులు అందగా, ఇప్పటివరకు 401 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో, ఒక దరఖాస్తు ఆఫ్‌లైన్‌లో ఆమోదం పొందింది. మరో 14 ఆన్‌లైన్‌ దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. కాగా, దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్‌ 6 వరకు గడువు ఉంది.

12,621 దరఖాస్తులు పెండింగ్‌

జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 12,621 దరఖాస్తులు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక వెల్ల డించింది. వీటిలో ప్రాథమిక పరిశీలన ప్రారంభం కాని (అన్‌ప్రాసెస్డ్‌) దరఖాస్తులు 612 ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన కోసం బూత్‌ స్థాయి అధికారులు(బీఎల్‌ఓ)లకు 8,050 దరఖాస్తులను కేటాయించారు. ఏఈఆర్‌ఓ వద్ద 1,437, ఈఆర్‌ఓ వద్ద 2,522 దరఖాస్తులు పరిశీలన, ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి.

జనగామ మండలంలో అత్యధికం..

జనగామ మండలం, అర్బన్‌లో అత్యధికంగా 3,150 దరఖాస్తులు అందాయి. వీటిలో ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు కూడా ఆమోదం పొందకపోవడంతో మొత్తం దరఖాస్తులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. బచ్చన్నపేట మండలంలో 1,306 దరఖాస్తులు రాగా, 214 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆమోదం పొందాయి. మరో 11 దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా, 1,081 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పాలకుర్తి మండలంలో 1,253 దరఖాస్తులు అందగా, 10 ఆన్‌లైన్‌, ఒక ఆఫ్‌లైన్‌ దరఖాస్తు ఆమోదం పొందింది. మిగిలిన 1,242 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలంలో 1,048 దరఖాస్తులకు గాను 57 ఆమోదం పొందగా, మూడు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 988 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. లింగాల ఘణపురం మండలంలో 1,021, దేవరుప్పులలో 1,017, జఫర్‌గఢ్‌లో 960, రఘునాథపల్లిలో 907 దరఖాస్తులు అందగా, ఆయా మండలాల్లో వచ్చిన దరఖాస్తులన్నీ పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. కొడకండ్ల మండలంలో 736 దరఖాస్తులు రాగా, రెండు ఆమోదం పొందగా 734 పెండింగ్‌లో ఉన్నాయి. చిల్పూర్‌ మండలంలో 655 దరఖాస్తులకు గాను ఒకటి ఆమోదం పొందగా, 654 పెండింగ్‌లో ఉన్నాయి. నర్మెట మండలంలో 630 దరఖాస్తులు అందగా, 90 ఆమోదం పొందాయి. మిగిలిన 540 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యల్పంగా తరిగొప్పుల మండలంలో 354 దరఖాస్తులు అందగా, 27 ఆమోదం పొందాయి. మరో 327 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫారమ్‌–18 దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి, ప్రక్రియ ను త్వరితగతిన పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు నివేదిక ద్వారా వెల్లడైంది.

ఫారమ్‌–18 దరఖాస్తులు 12,621 పెండింగ్‌

జనగామ మండలంలో అత్యధికం..

వచ్చే నెల 6 వరకు దరఖాస్తుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement