శ్రీ మహిషాసురమర్దిని అలంకరణలో అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

శ్రీ మహిషాసురమర్దిని అలంకరణలో అమ్మవారు

Oct 20 2026 1:26 AM | Updated on Oct 20 2026 1:26 AM

జనగామ: పట్టణంలోని అమ్మబావి ఉప్పలమ్మ సహిత ఆంజనేయస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణతో పల్లకిపై అమ్మవారిని పురవీధుల గుండా ఊరేగించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ పూజారి వారణాసి పవన్‌ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు ఆలయంలో నిర్వహించిన చండీహోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో డీసీపీ రాజామహేంద్ర నాయక్‌ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దుర్గమాతకు రూ. 20వేల వెండి కిరీటం

చిల్పూరు: మండలంలోని మల్కాపూర్‌ గ్రామంలోని దుర్గామాత ఆలయానికి సోమవారం అదే గ్రామానికి చెందిన కేశిరెడ్డి సంపత్‌రెడ్డి–రేణుక దంపతులు రూ.20 వేల విలువైన వెండి కిరీటాన్ని అర్చకుడు చొల్లేటి రాజేశ్వరశర్మకు అందజేశారు. కార్యక్రమంలో కేశిరెడ్డి రాకేష్‌రెడ్డిరజని, స్వాతి, పావణి, శ్యామల తదితరులు ఉన్నారు.

పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

జనగామ రూరల్‌: నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ ఆధ్వర్యంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతితో పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 5 కేటగిరీలో 8 పోస్టులు ఉన్నాయన్నారు. ఇందులో ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌ 3, ఫార్మసిస్ట్‌ 1, సైకాలజీకల్‌ కౌన్సిలర్‌ 1, యోగా ప్రొఫెసర్‌ 1, మల్టీపర్పస్‌ వర్కర్‌ 2 పోస్టులు ఉన్నాయన్నారు. 22వ తేదీ నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సంబంధిత అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 25వ తేదీన కలెక్టరేట్‌లో అర్హత పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

విత్తన డీలర్లకు అవగాహన

జనగామ రూరల్‌: తక్కువ నీటితో సాగు చేసే పంటల విత్తనాలను డీలర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఏఓ అంబి కా సోని సూచించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని చీటకోడూరు రైతు వేదికలో యాసంగి పంటల విత్తన విక్రయాల పై డీలర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. డీఏఓ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా విత్తన విక్రయాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శరత్‌ చంద్ర, వ్యవసాయ విస్తరణ అధికారులు అనిల్‌, మండలంలోని విత్తన డీలర్లు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

స్టేషన్‌ఘన్‌పూర్‌: విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్‌ సరఫరా అందించడమే లక్ష్యంగా ఎన్పీడీసీఎల్‌ పనిచేస్తోంద ని సంస్థ డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) టి.మధుసూదన్‌, డైరెక్టర్‌(ప్రాజెక్టు) మోహన్‌రావు అన్నారు. డివి జన్‌కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిపార్ట్‌ మెంటల్‌ ఎస్‌పీఎం షెడ్‌ను డైరెక్టర్లు సోమవా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన ఎస్‌పీఎం షెడ్‌ ప్రారంభించడంతో డివిజన్‌పరిధిలో లైన్‌ మెయింటనెన్స్‌, మరమ్మతులు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ పనులు వేగవంతంగా, సులభంగా నిర్వహించడానికి వీలవుతుందన్నారు. సీఈ (ఆపరేషన్స్‌) సురేందర్‌, ఎస్‌ఈ చెరుకు సంపత్‌రెడ్డి, డీఈలు విజయ్‌కుమార్‌, సారయ్య, అనీల్‌కుమార్‌, ఈఈ సివిల్‌ అనూప్‌కుమార్‌, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement