అడవిబాట పట్టినా | - | Sakshi
Sakshi News home page

అడవిబాట పట్టినా

Oct 20 2026 1:26 AM | Updated on Oct 20 2026 1:26 AM

జనగామ: దసరా వచ్చిందంటే చాలు..పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రజలంతా పాలపిట్ట దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఇంట్లో పూజలు ముగించుకుని, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలి సి జమ్మిచెట్టు వద్దకు బయలుదేరేవారు. దారిలో పాలపిట్ట కనిపిస్తే రెండు చేతులూ జోడించి నమస్కరి స్తూ, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకునేవారు. అనంతరం జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేసి, ప్రదక్షిణలు నిర్వహించి, జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకునేవారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో ఇప్పుడు పాలపిట్ట దర్శనమే ప్రశ్నార్థకంగా మారుతోంది.

పర్యావరణ అసమతుల్యతే కారణమా?

పర్యావరణంలో వస్తున్న మార్పులు పక్షుల ఆవాసాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పట్టణీకరణ, వ్యవసాయ భూముల స్వరూపంలో మార్పులు, చెట్ల తొలగింపు, బహిరంగ ప్రదేశాలు తగ్గిపోవడం, పురుగుమందుల అధిక వినియోగం వంటి అంశాలు పక్షులకు ఆహారం, ఆశ్రయం లభించడాన్ని ప్రభావితం చేయవచ్చు. పాలపిట్ట సాధారణంగా బహిరంగ గడ్డి భూములు, వ్యవసాయ క్షేత్రాలు, చెట్లతో కూడిన ప్రదేశాలు, విద్యుత్‌ తీగలు లేదా కొమ్మలపై కూర్చుని కీటకాలను వేటాడే ప్రాంతాల్లో కనిపిస్తుంది. అలాంటి ఆవాసాలు మారి పోతే దాని సంచారం, ఆహార లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉంది.

సెల్‌ఫోన్‌, టవర్ల రేడియేషన్‌ ప్రభావం ఉందా?

పాలపిట్ట కనిపించకపోవడంపై స్థానికుల్లో వినిపిస్తున్న అనుమానాల్లో సెల్‌ఫోన్‌ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్‌ కూడా ఒకటి. మొబైల్‌ టవర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాటి ప్రభావం పక్షులపై పడుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. రేడియేషన్‌ ఏకై క కారణంగా పేర్కొనడం కంటే ఆవాసాల నష్టం, ఆహార లభ్యత, పురుగు మందుల విని యోగం, వాతావరణ పరిస్థితులు, ఇతర మానవ కార్యకలాపాలతో పాటు ఈ అంశాన్నీ శాసీ్త్రయంగా పరిశీలించడం అవసరం. పాలపిట్ట దర్శనం సంప్రదా యంగా మిగిలిపోకుండా ఉండాలంటే పర్యావరణ పరిరక్షణే మార్గం.

దసరా రోజున పాలపిట్టను దర్శించుకోవాలనే నమ్మకంతో జనగామ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఊరి చివర నుంచి ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు కాలినడకన వెళ్తున్నా నిరాశే ఎదురవుతోందని చెబుతున్నారు. గతంలో పొలాల గట్లు, చెట్ల కొమ్మలు, బహిరంగ ప్రదేశాల్లో అప్పుడప్పుడు కనిపించే పాలపిట్ట, ఇప్పుడు అరుదుగా కూడా కనిపించడం లేదన్నది స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement