భక్తి పరిమళం.. బతుకమ్మ వైభవం | - | Sakshi
Sakshi News home page

భక్తి పరిమళం.. బతుకమ్మ వైభవం

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

– మరిన్ని ఫొటోలు IIIలోu

● పూలలో గౌరమ్మ.. పూజల్లో ఆడపడుచులు

● జిల్లాలో బతుకమ్మ సంబురాలు షురూ

● ఆటపాటలతో సందడి చేసిన మహిళలు

జనగామ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ జిల్లావ్యాప్తంగా శనివారం వైభవంగా ప్రా రంభమైంది. ప్రకృతిలో ల భించే రంగురంగుల అడ వి పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మగా కొలిచే మహిళలు సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొన్నారు. జనగామ, స్టేషన్‌ఘన్‌ పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలోని 12 మండలాలతో పాటు జిల్లా కేంద్రంలో పండుగ సందడి నెలకొంది. గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ప్రత్యే క ఏర్పాట్లు చేయగా, పట్టణాలు, గ్రామాలు, కాలనీల్లో పండుగ వాతావరణం కనిపించింది.

ప్రధాన కూడళ్లలో సందడి

జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట, తహసీల్దార్‌ కార్యాలయం, పాత బీటుబ జారు, శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం, గుండ్లగడ్డ, గిర్నిగడ్డ, శ్రీవిల్లాస్‌ కాలనీ, బాలాజీనగర్‌, కురుమవాడ, హౌసింగ్‌ బోర్డు, గోకుల్‌నగర్‌, బాణాపురం, శ్రీ సాయి రెసిడెన్సీ, అంబేడ్కర్‌నగర్‌, గ్రేయినన్‌ మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు బతుకమ్మలను చేతబట్టి ర్యాలీలుగా ప్రధాన కూడళ్లకు చేరుకున్నారు. సంప్రదాయ పాటలు పా డుతూ సంబురాలు చేసుకున్నారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత బతుకమ్మలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా డీసీపీ రాజామహేంద్ర నాయక్‌ పర్యవేక్షణ లో సీఐ సత్యనారాయణ, ఆయా మండలాల ఎస్సైలు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

తంగేడు పూలకు కొరత

బతుకమ్మ పేల్చడంలో ప్రత్యేక స్థా నం కలిగిన తంగేడు పూలు ఈసారి ఆశించిన స్థాయిలో లభించకపోవడం మహిళలను నిరాశకు గురిచేసింది. వర్షాభావ పరిస్థితులతో ఉన్న కొద్దిపాటి చెట్లకు పూలు సరిగా పూయ లేదు. దీంతో బంతిపూలతో పాటు రోడ్ల పక్కన లభించే ఇతర పూలను సేకరించి బతుకమ్మలను పేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement