అర్హులందరికీ సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

జనగామ: సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చూస్తానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జనగామ పట్టణానికి చెందిన 19 మంది, జనగామ రూరల్‌కు చెందిన 17 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. అర్హులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement