● మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి
● పురపాలికలో సహపంక్తి భోజనం
జనగామ: చెత్తను రోడ్లపై, డ్రెయినేజీల్లో వేయకుండా స్వచ్ఛ జనగామ కోసం ప్రతీ పౌరుడు తమతో కలిసి రావాలని మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, కౌన్సిలర్లు, కమిషనర్, అధికారులు, సిబ్బందికి చైర్‌పర్సన్ సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోల్లోనే వేయాలని, రోడ్లు, డ్రెయినేజీల్లో చెత్త వేయకుండా మున్సిపాలిటీ అందిస్తున్న సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


