డోర్‌ లాక్‌.. టెన్షన్‌ టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

డోర్‌ లాక్‌.. టెన్షన్‌ టెన్షన్‌

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

● కారులో చిక్కుకున్న నాలుగేళ్ల బాలుడు

● 20 నిమిషాల ఉత్కంఠ

స్టేషన్‌ఘన్‌పూర్‌: కారు డోర్‌ లాక్‌ కావడం, అందులో ముందు సీటులో నాలుగేళ్ల వయస్సున్న బాలుడు కూర్చుని ఉండటంతో 20 నిమిషాల పాటు ఉత్కంఠ నెలకొంది. ఈఘటన ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో సోమవారం జరిగింది. శివునిపల్లిలోని ఫైర్‌స్టేషన్‌ పక్కన ఉన్న టిఫిన్‌ సెంటర్‌లో టిఫిన్‌ తీసుకునేందుకు కుమారుడితో కారులో వచ్చిన ఓవ్యక్తి కారు దిగి డోర్‌ వేసి టిఫిన్‌ సెంటర్‌లోకి వెళ్లాడు. కారు ఆటోమెటిక్‌గా సెంట్రల్‌ లాక్‌ కావడంతో టిఫిన్‌ తీసుకుని వచ్చిన ఆ వ్యక్తి కారు డోర్‌ తీస్తే తెరుచుకోలేదు. ఎంత ప్రయత్నించినా డోర్‌ ఓపెన్‌ కాకపోవడంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. కారు లోపల బాలుడు ఉండటం, డోర్‌ రాకపోవడంతో ఉత్కంఠ నెలకొనగా పలువురు అక్కడ గుమిగూడారు. డోర్‌ తీయాలని బయటి నుంచి వారు చెపుతున్నా బాలుడికి అర్థం కాలేదు. దాంతో అక్కడ ఓ యువకుడు తన సెల్‌ఫోన్‌లో యూట్యూబ్‌ ఆన్‌ చేసి కారు అద్దం ఎలా దించాలో చూపించడంతో బాలుడు కారు అద్దం కిందికి దించాడు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement