మరింత సమర్థవంతంగా పారిశుద్ధ్య నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

మరింత సమర్థవంతంగా పారిశుద్ధ్య నిర్వహణ

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

జనగామ: మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు నూతనంగా అందుబాటులోకి వచ్చిన స్వచ్ఛ ఆటోల ర్యాలీని సోమవారం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేపట్టడంతో పాటు ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించనున్నారు. ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి స్వచ్ఛ ఆటోలకు అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా మున్సిపల్‌ సిబ్బందికి సహకరించాలని కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి సూచించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌ మాట్లాడుతూ.. స్వచ్ఛ జనగామ లక్ష్యంగా మున్సిపాలిటీ నిరంతరం పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, వార్డు అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పట్టభద్రుల ఓటరు జాబితా డీ–నోవో తయారీపై నోటీసు

జనగామ: వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా డీ–నోవో (కొత్తగా) తయారీ ప్రక్రియలో భాగంగా మున్సిపల్‌ కార్యాలయంలో నోటీసు ప్రచురించినట్లు కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1అక్టోబర్‌ 2026 అర్హత తేదీగా నిర్ణయిస్తూ, నల్లగొండ అదనపు కలెక్టర్‌, ఎన్నికల నమోదు అధికారి జారీ చేసిన నోటీసును మున్సిపల్‌ కార్యాలయ నోటీస్‌ బోర్డుతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రముఖ ప్రదేశాల్లో ప్రదర్శించినట్లు తెలిపారు. ప్రజల సమాచారం కోసం నోటీసు ప్రతులతో పాటు ఫారం–18ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సం ఘం, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు డీ–నోవో ఓటరు జాబితా తయారీపై అవసరమైన ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన పట్టభద్రులు సంబంధిత ఎన్నికల అధికారుల సూచనల మేరకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.

రెడ్‌క్రాస్‌ రాష్ట్ర మేనేజ్‌మెంట్‌ సభ్యుడిగా దొంతుల శేఖర్‌

జనగామ: తెలంగాణ స్టేట్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ మేనేజ్‌మెంట్‌ సభ్యుడిగా జిల్లా కేంద్రానికి చెందిన దొంతుల శేఖర్‌ ఎన్నికయ్యారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు రెడ్‌క్రాస్‌ సరైన వేదికగా భావించి ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర మేనేజ్‌మెంట్‌ సభ్యుడిగా ఎన్నికై నట్లు తెలిపారు. రెడ్‌క్రాస్‌ ద్వారా జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన జిల్లా రెడ్‌క్రాస్‌ సభ్యులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

అంతర్జాతీయ

చెస్‌ పోటీల్లో ప్రతిభ

బచ్చన్నపేట : అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో మండలంలోని సాల్వాపూర్‌ గ్రామానికి చెందిన బోయిని అనిల్‌ సత్తా చాటారు. గ్రామానికి చెందిన బోయిని కర్ణాకర్‌ కుమారుడు అనిల్‌ పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఢిల్లీలో వాజీపూర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో 900 మంది విద్యార్థులకు పైగా పాల్గొనగా అనిల్‌ 15 ఏళ్ల విభాగంలో పాల్గొని అత్యంత ప్రతిభ చూపి 13వ స్థానంలో నిలిచాడు. గత ఆరు నెలల కాలంలో చైన్నె, మంగళూరు, ముంబాయి, ఢిల్లీ తదితర నగరాల్లో నిర్వహించిన వివిధ చెస్‌ పోటీల్లో పాల్గొని ఏకంగా తొమ్మిది అవార్డులు, కప్‌లను కైవసం చేసుకున్నాడు. ఈసందర్భంగా అనిల్‌ను సర్పంచ్‌ మిద్దెల శ్రీధర్‌గౌడ్‌, గ్రామస్తులు, తోటి విద్యార్థులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement