ఓటుహక్కును హరిస్తే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

ఓటుహక్కును హరిస్తే ఊరుకోం

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

జనగామ: ఓటు హక్కును పరిరక్షించాలని, ఓటర్ల జాబితా సవరణ, ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఈర్‌) ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాల ని, ఓటు హక్కును హరిస్తే ఊరుకోమని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, టీపీసీసీ సభ్యులు, వైటీడీఏ మెంబర్‌ లక్ష్మీనారాయణ నాయక్‌, మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేసి, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం స్టేషన్‌ ఘన్‌పూ ర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరును ఓటర్‌ జాబితా నుంచి తొలగించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. ఓటర్‌ జాబితాలో మార్పులు, తొలగింపులు, అభ్యంతరాలపై ప్రజలకు స్పష్టమైన సమాచా రం అందించాలని, ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పెరిగేలా ఎన్నికల సంఘం వ్యవహరించాలన్నారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ నిరంతరం పోరాడుతుందని డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ అన్నారు. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్‌ జాబితా సవరణలో పారదర్శకత పాటించాలని, ఓటర్ల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ శ్రేణులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వైటీడీఏ మెంబర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ నాయక్‌ మాట్లాడుతూ.. ఓట్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాకు అందించారు. ఉన్న ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలని, ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ మరుజోడు రాంబాబు, నాయకులు వేమళ్ల సత్యనారాయణరెడ్డి, ఏఎంసీ మార్కెట్‌ చైర్మన్‌ బనుక శివరాజు, లావణ్య, మంజుల, లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, గుడి వంశీధర్‌ రెడ్డి, నూకల బాల్‌రెడ్డి, ఉడత రవి, పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, లోక్కుంట్ల ప్రవీణ్‌, మాజిద్‌ అప్సర్‌, బడికే ఇందిర, బోనాసి క్రాంతి, జాయ మల్లేష్‌, అభిగౌడ్‌, మేడ శ్రీనివాస్‌, జిల్లెళ్ల సిద్ధారెడ్డి, చింతకింది మల్లేష్‌ తదితరులు ఉన్నారు.

ఓట్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి

కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ

ఆధ్వర్యంలో భారీ ధర్నా

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ దిష్టిబొమ్మ దహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement