జనగామ రూరల్: యువ వికాసం పథకం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. నవంబరు 19 నుంచి రాజీవ్ యువవికాసం పథకం స్వయం ఉపాధి యూనిట్లకు ఆర్థిక సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించడంతో పథకం అమలుపై ఆశలు చిగురిస్తున్నాయి. యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన యువ వికాసం పథకం లబ్ధికి 17 నెలలుగా దరఖాస్తుదారులు నిరీక్షిస్తున్నారు. ఏప్రిల్ 2025లో పథకం అమలుకు అధికారులు జిల్లావ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించారు. 30 వేలకుపైగా వినతులు అందాయి. వాటి పరిశీలన పూర్తయినా నేటికీ దరఖాస్తుదారులకు పథకం లబ్ధిచేకూరలేదు. దరఖాస్తులను కలెక్టర్ సమక్షంలో పారదర్శకంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని మంత్రి ఆదేశించడంతో నిరుద్యోగులు ఉపాధికి భరోసా లభించనుంది.
రాయితీ ఇలా..
ప్రభుత్వం దరఖాస్తుదారులకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రాయితీతో కూడిన రుణం అందించనుంది. రూ.50 వేల యూనిట్‌కు పూర్తిగా వంద శాతం లబ్ధి చేకూర్చనున్నారు. రూ.లక్ష యూనిట్‌కు 90 శాతం రాయితీ, రూ.2 లక్షల యూనిట్‌కు 80 శాతం రాయితీ, రూ. 4లక్షల యూనిట్‌కు 70 శాతం రాయితీ, రూ.5 లక్షల యూనిట్‌కు 60 శాతం రాయితీ కల్పించనున్నారు. పథకం లబ్ధి పొందేందుకు బీసీ సామాజిక వర్గ నిరుద్యోగులు అత్యధికంగా దరఖాస్తు చేసుకున్నారు. పథకం రుణంలో అత్యధికంగా రాయితీ ఉండటంతో సునాయాసంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంది.
పారదర్శకంగా ఎంపిక చేయాలి
యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హత గల లబ్ధిదారులకే వర్తింపజేయాలి. ఎలాంటి పైరవీలకు తావులేకుండా ఎంపిక ప్రక్రియ చేపట్టాలి. గ్రామసభల ద్వారా లబ్ధిదారులకు యూనిట్లు అందజేయాలి. –ఎల్లబోయిన హరీశ్,
జిల్లా అధ్యక్షుడు, బీజేవైఎం
95 328
యూనిట్లు దరఖాస్తులు
రాజీవ్ యువ వికాసం పథకం
అమలుకు సన్నద్ధం
నవంబర్‌లో ప్రారంభిస్తామని
ప్రకటించిన ప్రభుత్వం
నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు
17నెలలుగా ఎదురుచూపులు
ఎంపీడీఓల పర్యవేక్షణలో..
ఎంపీడీఓల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందులో బ్యాంకర్లను కూడా భాగస్వాములను చేస్తున్నారు. అయితే బ్యాంక్ సిబిల్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేకుండా పారదర్శకంగా చేపట్టేలా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
దరఖాస్తుల వివరాలు ఇలా..


