జీఓ 97ను రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

జీఓ 97ను రద్దు చేయాలి

Aug 30 2026 1:03 AM | Updated on Aug 30 2026 1:03 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: పాలిటెక్నిక్‌ విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి జీఓ 97ను రద్దు చేయాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. డివిజన్‌ కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఓ 97 విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే స్పందించారు. మాజీ విద్యాశాఖ మంత్రిగా జీఓ 97ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎంను ప్రత్యేకంగా కోరుతున్నానన్నారు. పాలిటెక్నిక్‌ ఎడ్యుకేషన్‌ను ఇంజనీరింగ్‌ విద్యతోనే ఉంచాలని, పాలిటెక్నిక్‌ విద్యార్థులను లేబర్‌ ఎంప్లాయింట్‌మెంట్‌ కిందికి తీసుకురావద్దన్నారు. తద్వారా విద్యార్థుల్లో లేని అపోహలు వస్తున్నాయని, ఇంజనీరింగ్‌ చదివేవాళ్లం లేబర్‌ డిపార్ట్‌మెంట్‌కు పోతామనే ఒక లేని అపోహ విద్యార్థుల మనస్సులో ఉందన్నారు. కాగా, పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ వేసిందని, కమిటీ అన్నింటినీ అధ్యయనం చేస్తోందన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ తాటికొండ వినయ్‌కుమార్‌, వైస్‌చైర్మన్‌ నీల రాజమ్మ గట్టయ్య, ఏఎంసీ చైర్‌పర్సన్‌ జూలుకుంట్ల లావణ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీ ష్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్‌రాజ్‌, నాయకులు బెలిదె వెంకన్న, బూర్ల శంకర్‌, పోశాల కృష్ణ, గట్టు రమేశ్‌, బొల్లు లక్ష్మీ, సింగపురం వెంకటయ్య, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement