● వ్యవసాయ శాస్త్రవేత్తలు
డాక్టర్ రమ్య, గోన్యనాయక్
జఫర్‌గఢ్: మారుతున్న పరిస్థితులకనుగుణంగా రైతులు పంటల సాగు విధానాన్ని మార్చుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు జిల్లా రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ వి.రమ్య, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ పి.గోన్యనాయక్ కోరారు. జిల్లాలోని జఫర్‌గఢ్, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల్లోని తీగారం, సూ రారం, చాగల్లు, రాఘవపూర్ గ్రామాల్లో పర్యటించి వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, కందులతో పాటు వివిధ రకాల కూరగాయల పంటలను క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి పంటల సాగు విధానంపై పలు సూచనలు చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనలను రైతులు తప్పనిసరిగా పాటించి నష్టాలను తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి చంద్రణ్‌కుమార్‌తో పాటు ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.


