ప్రయాణికుల వసతులపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల వసతులపై దృష్టి

Aug 30 2026 1:03 AM | Updated on Aug 30 2026 1:03 AM

కాజీపేట రూరల్‌/ఖిలా వరంగల్‌: కాజీపేట రూరల్‌ : సికింద్రాబాద్‌–కాజీపేట మధ్య శుక్రవారం రాత్రినుంచి శనివారం తెల్లవారుజాము వరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీ వాస్తవ సికింద్రాబాద్‌ నుంచి మణుగూర్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజన్‌లో ప్రయాణిస్తూ నైట్‌ పుట్‌ప్లేట్‌ తనిఖీ నిర్వహించారు. కాజీపేట వరకు రైలు ఇంజన్‌లో తనిఖీలో భాగంగా రైల్వే జీఎం సిగ్నల్స్‌, వాటి స్పష్టత, ఓవర్‌హెడ్‌ ట్రాక్షన్‌ ట్రాక్‌ పరిస్థితి, వేగ పరిమితి, హెచ్చరికలు, వేగాలు తదితర వాటిని సమీక్షించారు. రైలు నడుపుతున్న లోకోపైలెట్‌లు, ట్రైన్‌ మేనేజర్ల పని విధానం, సిగ్నల్స్‌ మార్పిడి చేయడంలో మాస్టర్స్‌ పాయింట్స్‌మెన్‌, గేట్‌మెన్‌ వంటి మార్గమధ్య సిబ్బంది అప్రమత్తతను గమనించారు. కాజీపేటలో దిగిన ఆయన రోడ్డు మార్గంలో నేరుగా వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. డీఆర్‌ఎం గోపాల కృష్ణన్‌తో కలిసి ఆయన స్టేషన్‌లోని ప్లాట్‌ఫారాలు, ప్రాంగణం, వెయిటింగ్‌ హాళ్లు పరిశీలించారు. స్టేషన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అమృత్‌ బారత్‌స్టేషన్‌ పథకంలో భాగంగా రూ.25.41 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో పుట్‌ఓవర్‌ బ్రిడ్జి, అధునిక ప్రవేశ ద్వారం, వెయిటింగ్‌ హాళ్లు, ప్లాట్‌పామ్స్‌ షెల్టర్లు, లిప్టులు,ఎస్కలేటర్లను పరిశీలించి..వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మేనేజర్లు ఆగ్గి రవీందర్‌, వి.సుదర్శన్‌రావు, డీఓఎం నరేందర్‌ వర్మ, ఆర్పీఎఫ్‌, జీఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

దక్షిణ మధ్య రైల్వే జీఎం

సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement