● జిల్లాలో ఘనంగా రాఖీ వేడుకలు
● ఆడపడుచులతో ఊరూవాడ సందడి
జనగామ: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. సోదరులకు రాఖీలు కట్టిన అక్కాచెల్లెళ్లు తమ ఆప్యాయతను చాటుకున్నారు. దేశ రక్షణలో సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సోదరులను ప్రత్యక్షంగా కలుసుకోలేని అక్కాచెల్లెళ్లు జిల్లాలోని అనేక గ్రామాల నుంచి పోస్టల్ ద్వారా రాఖీలు పంపించి తమ ప్రేమను చాటుకున్నారు. ఆడపడుచులు, పిల్లలతో గ్రామాలన్నీ కళకళలాడాయి. రాఖీ పండుగ సందర్భంగా స్వీట్‌షాపులు, బట్టల షాపుల్లో వ్యాపారం జోరుగా సాగింది.
ఎఫ్‌ఎల్‌ఎన్‌పై అవగాహన కల్పించడానికి పట్టణంలోని ఉపాధ్యాయులు వినూత్నంగా తయారుచేసిన రాఖీ


