హన్మకొండ కల్చరల్: శాకంబరీ నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని భద్రకాళి దేవా లయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత అన్నారు. ఆలయ ప్రాంగణంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామల సునీత, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, సిబ్బంది పాల్గొని శాకంబరీ ఉత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రామల సునీత మా ట్లాడుతూ.. ఈ నెల 15 బుధవారం నుంచి జూలై 29 బుధవారం వరకు 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు, అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ.. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం అమ్మవారికి ఒక్కో క్రమాలలో పూజలు నిర్వహించనున్నట్లు, జూలై 29న మహా శాకంబరీగా అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నాగరాజుశర్మ, హరినాఽథ్‌లు పాల్గొన్నారు.


