కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని మేథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ‘సైంటిఫిక్ కంప్యూటింగ్ అండ్ విజువలైజేషన్’ అంశంపై మూడు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌ను నిట్‌లోని రామన్‌హాల్‌లో అట్టహాసంగా ప్రారంభించారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇండీస్, సేయింట్ ఆగస్టీన్ ప్రొఫెసర్, హెడ్ శ్రీధరరావు గునకాల ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించి, కాన్ఫరెన్స్ సావనీర్‌ను విడుదల చేశారు. కాన్ఫరెన్స్‌లో భాగంగా శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన నిట్ ప్రొఫెసర్లు కేఎన్‌ఎస్, కాశీవిశ్వనాథన్, జేవీ రమణమూర్తిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ పీవీఎస్‌ఎన్ మూర్తి, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ వైవీఎస్‌ఎస్ సన్యాసిరాజు, నిట్ ఇన్‌చార్జ్ డైరెక్టర్, ప్రొఫెసర్ ఎన్వీ.ఉమామహేశ్, సీహెచ్.రామ్‌రెడ్డి పాల్గొన్నారు.


