ప్రజల్లో నమ్మకం కలిగించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజల్లో నమ్మకం కలిగించాలి

Jul 9 2026 6:35 AM | Updated on Jul 9 2026 6:35 AM

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత

స్టేషన్‌ఘన్‌పూర్‌ పోలీసుస్టేషన్‌ సందర్శన

స్టేషన్‌ఘన్‌పూర్‌: వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని, భరోసాను కలిగించేలా పోలీసులు పనిచేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత సూచించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ను వరంగల్‌ సీపీ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు డీసీపీ రాజమహేంద్రనాయక్‌ స్వాగతం పలికారు. అనంతరం సీపీ పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలించడంతో పాటు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తరచుగా అధిక సంఖ్యలో జరిగే నేరాలు, స్టేషన్‌పరిధిలోని గ్రామాలు, ప్రస్తుతం గ్రామాల్లో స్థితిగతులు, స్టేషన్‌ నిర్వహణ తదితర అంశాలను సీఐ జి.వేణును అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. రాత్రి సమయాల్లో వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. సీపీ వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్‌, ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ జి.వేణు, ఎస్‌ఐ మనీషా తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement