రైతులకు వెన్నుదన్నుగా ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రైతులకు వెన్నుదన్నుగా ప్రభుత్వం

Jul 8 2026 1:08 AM | Updated on Jul 8 2026 1:08 AM

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివరాజ్‌యాదవ్‌

జనగామ: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోందని జనగామ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌ అన్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఆయన అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం చైర్మన్‌ మాట్లాడుతూ.. విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న టీజీ బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌ కోసం అధికారులు ఏఎంసీ పరిధిలో స్థలం కోరిన నేపథ్యంలో, పత్తి యార్డులోని ఖాళీ స్థలం లేదా ఏఎంసీకి చెందిన ఇతర ఖాళీ ప్రదేశాన్ని వినియోగించుకోవచ్చని సమావేశంలో తీర్మానించారు. ఏఎంసీలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని, నూతన ఏఎంసీ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్‌ కార్యదర్శి శ్రీదేవి, డైరెక్టర్లు ఎండీ బాష్మియా, బొట్ల నర్సింగరావు, బానోత్‌ బన్సీ నాయక్‌, నీల మోహన్‌, తోటకూరి రమేశ్‌ యాదవ్‌, శీలం కొండల్‌రెడ్డి, పర్ష సిద్ధేశ్‌, నామాల శ్రీనివాస్‌, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement