జనగామ రూరల్: ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయిందని, రేపటిలోగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారం అందిస్తే ఆర్పీ 31 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీసీలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 97 శాతం పూర్తయ్యిందని, 11.38 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీఓ గోపిరామ్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన
ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి


