జనగామ రూరల్: ఈనెల 11వ తేదీన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు ఉంటాయని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి 14, 16, 18, 20 మెన్–ఉమెన్ విభాగాల్లో అథ్లెటిక్స్ ఎంపికలు స్థానిక మినీ స్టేడియం, ధర్మకంచలో జరుగుతాయని, ఎంపికైన క్రీడాకారులు 18న ఇందిరాగాంధీ స్టేడియం మెదక్‌లో జరిగే రాష్ట్ర స్థాయి మిడిల్ డిస్టెన్‌న్స్, లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లాస్థాయి ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 11వ తేదీ ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మెమోతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు గంగిశెట్టి మనోజ్ కుమార్ 9885046437, ఆవుల అశోక్ 9912453220, వంచ చంద్రశేఖర్ రెడ్డి 7799552233, తూడి రంజిత్ 99852 23047 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) రెండో సెమిస్టర్ ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బి.ఎన్.సురేఖ సోమవారం విడుదల చేశారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..రెండో సంవత్సరంలో మొత్తం 289 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా ఇందులో 159 మంది ఉత్తీర్ణత సాధించారని, 130 మంది ఫెయిల్ అయ్యారని తెలిపారు. పరీక్షలకు సహకరించిన కాకతీయ విశ్వవిద్యాలయం కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాజేందర్ కట్ల, అడిషినల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరుమలాదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు భవాని, వందన, నవీన రాణి, లక్ష్మీ అనురాధ, శ్రీదేవి, కళ్యాణి, అనగాని శ్రీనివాస్, నర్సింహులు, రవీందర్ నాయక్, రాజ్‌కుమార్, సంధ్యారాణి, ప్రశాంత్ పాల్గొన్నారు. కాగా, కళాశాల టాపర్స్‌గా శివరాత్రి పూజ 9.8, వల్లాల జాహ్నవి 9.8శాతం సాధించారు. బీఏలో మహ్మద్ అబ్దుల్ అజీమ్, సయ్యద్ సమీరా, బీకాంలో టి.షైనీ, వక్కల సాత్విక, లైఫ్‌సైన్స్‌లో భవాని, ప్రకాశ్, ఫిజికల్ సైన్స్‌లో శివరాత్రి పూజ, వల్లాల జాహ్నవి, టి.నివేదిత, సూరజ్ సింగ్, జడల నిఖిత, మహ్మద్ ఆఫ్రిన్ టాపర్లుగా నిలిచారు.
ఆర్డీఓ గ్రీవెన్స్‌కు
తొమ్మిది దరఖాస్తులు
స్టేషన్‌ఘన్‌పూర్: కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో సోమవారం తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్‌ప్రకాష్ మాట్లాడుతూ.. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, భూసమస్యలపైనే దరఖాస్తులు వస్తున్నాయన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సమస్యలుంటే నేరుగా గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
యాంటీ రేబీస్ టీకాలు
వేయించాలి
జనగామ రూరల్: పెంపుడు జంతువులకు యాంటీ రేబీస్ టీకాలు వేయించుకోవాలని జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ మురళీధర్ రావు అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జనగామ వెటర్నరీ ఆసుపత్రిలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో యాంటీ రేబీస్ టీకా శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా 45 పెంపుడు జంతువులకు యాంటీ రేబీస్ టీకాలు వేశారు. జూనోటిక్ వ్యాధులను గురించి వివరించి, రేబీస్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించేందుకు అవసరమైన టీకాలను అన్ని వెటర్నరీ సంస్థల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు రణజిత్, దేవేందర్, రవిప్రసాద్ పాల్గొన్నారు.


