పలు చేనేత సొసైటీలు ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

పలు చేనేత సొసైటీలు ఏకగ్రీవం

Jul 7 2026 1:01 AM | Updated on Jul 7 2026 1:01 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఘన్‌పూర్‌ చేనేత పారిశ్రామిక సహకార, విక్రయ సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. సోమవారం నామినేషన్ల పరిశీలన కాగా అధ్యక్షుడితో పాటు డైరెక్టర్లు తొమ్మిది మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం అధ్యక్షుడిగా శివునిపల్లికి చెందిన గుండు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా శివునిపల్లికి చెందిన బిట్ల రంగయ్య, కార్యదర్శిగా ఎక్కలదేవి ఉప్పలయ్య, డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

బచ్చన్నపేటలో రెండు..

బచ్చన్నపేట : మండల కేంద్రంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి సిల్క్‌ వీవర్స్‌ కోపరేటివ్‌ సొసైటీ, మార్కండేయ హెచ్‌డబ్ల్యూ సీఎస్‌ లిమిటెడ్‌ సొసైటీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు మహేశ్వరం స్వర్ణలత, సీహెచ్‌. గంగాధర్‌ తెలిపారు.

కంచనపల్లి చేనేత సంఘం..

రఘునాథపల్లి: మండలంలోని కంచనపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా రాపోలు ఈశ్వరయ్య, ఉపాధ్యక్షుడిగా అమృతం చంద్రయ్య, కార్యదర్శిగా శ్రీపతి కుమారస్వామి, డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

శ్రీ శ్రీనివాస పవర్‌లూమ్‌ వీవర్స్‌..

కొడకండ్ల: మండలంలోని శ్రీ శ్రీనివాస పవర్‌లూమ్‌ వీవర్స్‌ కో ఆపరేటివ్‌ ప్రొడక్షన్‌ సెల్స్‌ సహకార సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది.

కొత్తపల్లి సొసైటీ డైరెక్టర్లు..

లింగాలఘణపురం: మండలంలోని కొత్తపల్లి చేనేత సహకారం సంఘం సొసైటీలోని 9 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి కోర్నేలియస్‌ ప్రకటించారు.

డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం

పాలకుర్తి టౌన్‌ (దేవరుప్పుల): మండలంలోని సీతారాంపురంలో శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్‌ నూతన కార్యవర్గ డైరెక్టర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి పోలంపల్లి వినోద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement