● డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి
జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అన్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేసిన సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రైతు భరోసా నిధులను విడుదల చేయడం రైతా ంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సీఎం రాజకీయ ప్రస్థానం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు, వైటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి, నాయకులు, కౌన్సిలర్లు ఎర్రమల్ల సుధాకర్, కంచె రాములు, కొత్త కరుణాకర్ రెడ్డి, నూకల బాల్ రెడ్డి, నిమ్మతి మహేందర్‌రెడ్డి, అభిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.


