● గృహ నిర్మాణ శాఖ సీఈ చైతన్యకుమార్
స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్రంలో గుడిసెలు లేని గ్రామాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం, గృహ నిర్మాణ శాఖ పని చేస్తుందని హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ చైతన్యకుమార్ అన్నారు. ఘన్‌పూర్ పట్టణ కేంద్రంతో పాటు శివునిపల్లి, ఇందిరానగర్ తదిత ర ప్రాంతాల్లో గృహ నిర్మాణ శాఖ సీఈ శనివారం ప ర్యటించి గుడిసెలను సందర్శించారు. ఈ సందర్భంగా గుడిసెల్లో నివాసం ఉంటున్న వారితో ‘మీ కు స్వంత ఇంటి స్థలం ఉందా, ఇళ్లు మంజూరీ చేస్తే నిర్మాణం చేసుకుంటారా’? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులనే ఎంపిక చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరీ అవుతున్నాయన్నారు. ఆయన వెంట పీడీ మాతృనాయక్, డీఈ చంద్రశేఖర్, ఏఈ అఖిల, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, కౌన్సిలర్లు పొన్న రవి, పెసరు సారయ్య, అనూషరాజు, సిబ్బంది పాల్గొన్నారు.


