‘ఎస్‌ఐఆర్‌’ను బాధ్యతగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

‘ఎస్‌ఐఆర్‌’ను బాధ్యతగా చేపట్టాలి

Jul 5 2026 2:42 AM | Updated on Jul 5 2026 2:42 AM

అడిషనల్‌ చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌

వెంకటేశ్వర్లు

స్టేషన్‌ఘన్‌పూర్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని బీఎల్‌ఓలు బాధ్యతగా చేపట్టాలని అడిషనల్‌ చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్‌ఐఆర్‌ 2026లో భాగంగా చేపడుతున్న పనులను ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 118వ పోలింగ్‌స్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ బీఎల్‌ఓలు ఎన్యుమరేషన్‌ ఫారాలను ఎలా నింపుతున్నారు, డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఏవిధంగా జరుగుతుందో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఎల్‌ఓలు అప్రమత్తంగా, బాధ్యతగా పనిచేయాలని, ప్రతీ ఇంటికి ఎన్యుమరేషన్‌ ఫారాలు అందించాలన్నారు. బీఎల్‌ఓల పనితీరుపై సూపర్‌వైజర్లు, మండలస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ఆయన వెంట స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్‌డీఓ కిరణ్‌ ప్రకాష్‌, తహసీల్దార్‌ స్వప్న, ఎన్నికల నాయబ్‌ తహసీల్దార్‌ సదానందం, ఎంఆర్‌ఐ శ్రీకాంత్‌, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement