వాహన కండీషన్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

వాహన కండీషన్‌ తప్పనిసరి

Jul 5 2026 2:42 AM | Updated on Jul 5 2026 2:42 AM

బచ్చన్నపేట: వాహనంతో పా టు అంబులెన్స్‌లోని పరికరాల ను వర్కింగ్‌ కండీషన్‌లో ఉంచుకోవాలని 108 జిల్లా మేనేజర్‌ రాము అన్నారు. శనివారం బచ్చన్నపేట ఆస్పత్రిలోని అంబులెన్స్‌ను ఆకస్మికంగా తనిఖీ ని ర్వహించి అంబులెన్స్‌లోని అత్యవసర మందులు, వాటి కాల పరిమితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్టీ చాన ల్‌ మానిటర్‌, బీపీ ఆపరేటర్‌, డిజిటల్‌ పెర్మామీటర్‌ సెక్షన్‌ ఆపరేటర్‌, పల్స్‌ ఆక్సి మీటర్‌ల ప్రాముఖ్యత చాలా ఉంటుందన్నారు. విషపూరిత పాములు, తేలు కరిచినప్పుడు దగ్గరలో ఉ న్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రజల ప్రా ణానికి ప్రమాదం లేకుండా జాగ్రత్త వహించా లన్నారు. ఈఎంటీ భాస్కర్‌, పైలట్‌ సాయికుమార్‌, జంగిలి శిరీష, తదితరులు ఉన్నారు.

యువతకు స్వయం

ఉపాధికి అవకాశాలు

జనగామ రూరల్‌: తెలంగాణ క్రైస్తవ, మైనార్టీల ఆర్థిక సంస్థ నుంచి అందించే ఆర్థికసాయానికి అర్హులైన క్రైస్తవులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ అధికారి విక్రమ్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుట్టు మిషన్‌, చిన్న తరహా వ్యాపార యూనిట్ల కోసం 21 నుంచి 55 ఏళ్ల వయస్సులోపు వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షల లోపు ఉండాలన్నారు. ఆసక్తిగల వారు ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 040–29801130 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

ఇంటర్‌లో స్పాట్‌ అడ్మిషన్లకు అవకాశం

జనగామ రూరల్‌: జిల్లాలోని తెలంగాణ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరానికి సంబంధించిన మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి కె.శారద, డీసీఓ పి. శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మార్చిలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఎస్సెస్సీ మెమోతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. రేపు (సోమవారం) ఉదయం 9 నుంచి 1 గంట వరకు జిల్లాలోని గురుకుల బాలుర కళాశాలలో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

గ్రిల్స్‌లో ఇరుక్కుపోయిన

మహిళ కాలు

జనగామ: జనగామ ఆర్డీఓ కార్యాలయం ప్రధాన గేట్‌ వద్ద ఉన్న ఇనుప గ్రిల్స్‌లో ఓ మహిళ కాలు ఇరుక్కుపోయింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన ఎడ్ల రమ్యశ్రీనాథ్‌ కోర్టు సంబంధిత పనుల కోసం శనివారం ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. పని ముగించుకుని బయటకు వస్తుండగా ప్రధాన గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన గ్రిల్స్‌లో ఆమె కాలు ఇరుక్కుపోయింది. దీంతో సమాచారం అందుకున్న స్థానికులు కట్టర మిషన్‌ సహాయంతో ఇనుప రాడ్డును తొలగించి మహిళ కాలును సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనతో ఆర్డీఓ కార్యాలయం వద్ద కొంతసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఉత్తమ ఫలితాలు

సాధించాలి

స్టేషన్‌ఘన్‌పూర్‌: ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించేలా అ ధ్యాపకులు కృషి చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ తాటికొండ వినయ్‌కుమార్‌ తెలిపారు. శనివా రం ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలను ఆయన సందర్శించారు. కళాశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించి కళాశాలల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తేనే గుర్తింపు లభిస్తుందన్నారు. ఆయన వెంట కౌన్సిలర్లు పొన్న రవి, గుర్రం హరినాఽథ్‌, నాయకులు గట్టు రమేష్‌, పెసరు సారయ్య, రాజు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement