జనగామ: జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం నామినేషన్ల పర్వం ముగిసింది. 12 సహకార సంఘాల పరిధిలో స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఈ నెల 2వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ జరిగింది. నేడు (ఆదివారం) నామినేషన్ల పరిశీలన, 6న ఉపసంహరణ, అదే రోజు తుది అభ్యర్థుల జాబితా విడుదలతో పాటు ఎన్నికల గుర్తుల కేటాయింపు చేపట్టనున్నారు. అనంతరం 10వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఒక్కో సొసైటీలో చైర్మన్, వైస్ చైర్మన్‌తో కలుపుకుని 9 మందితో కూడిన పాలక మండలి ఉంటుంది. ఇందులో ఇద్దరు మహిళలకు రిజర్వు చేశారు. నేటి నామినేషన్ల పరిశీలన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది. బచ్చన్నపేట సిద్ధేశ్వర, స్టేషన్‌ఘన్‌పూర్ హెచ్‌డబ్ల్యూసీఎస్, కొడకండ్ల శ్రీనివాస పవర్‌లూం, నీర్మాల శ్రీ భావనారుషి హెచ్‌డబ్ల్యూసీఎస్ సొసైటీలు ఏకగ్రీవం కాగా, 8 సొసైటీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. ఐదు సొసైటీల పరిధిలో మహిళలు ఏకగ్రీవమయ్యారు.
ఏకగ్రీవాలు..ఎన్నికలు
జనగామ (వీవర్స్ కాలనీ) భారత్ టీసీ జెడ్‌బీహెచ్‌డబ్ల్యూసీఎస్ సొసైటీ–27 నామినేషన్లు రాగా ఎన్నికలు అనివార్యం. జనగామ (సంజయ్‌నగర్) ప్రాజె క్టు హెచ్‌డబ్ల్యూసీఎస్ సొసైటీ–19 నామినేష న్లు రాగా మహిళా స్థానాలకు ఇద్దరు మాత్రమే నామినేషన్ వేయడంతో వారు ఏకగ్రీవమయ్యారు. పురుషులకు ఎలక్షన్లు నిర్వహించనున్నారు. బచ్చన్నపేట మండలం మార్కండేయ హెచ్‌డబ్ల్యూసీఎస్ సొసైటీలో మహిళా స్థానాలు ఏకగ్రీవం, పురుషులకు ఎలక్షన్లు, శ్రీ సిద్ధేశ్వర సిల్క్ డబ్ల్యూసీఎస్ సొసైటీ–9 నామినేషన్లు, పాలకవర్గం ఏకగ్రీవమయ్యారు. పాలకుర్తి మండలం గూడూరు హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీ–16 నామినేషన్లు రాగా ఎన్నికలు నిర్వహించనున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీ–9 నామినేషన్లు, పాలకవర్గం ఏకగ్రీవం. లింగాలఘణపురం మండలం కొత్తపల్లి శ్రీ వెంకటేశ్వర హెచ్‌డబ్ల్యూసీఎస్ సొసైటీలో మహిళా స్థానాలు ఏకగ్రీవం, పురుషులకు ఎలక్షన్లు. దేవరుప్పుల మండలం సీతారాంపురం శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర హెచ్‌డబ్ల్యూసీఎస్ సొసైటీలో 16 నామినేషన్లు, ఎన్నికలు అనివార్యం కాగా నీర్మాల శ్రీ భావనరుషి హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీలో 9 నామినేషన్లు, పాలకవర్గం ఏకగ్రీవమయ్యారు. రఘునాథపల్లి మండలం కంచనపల్లి శత్రంజి హెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీలో మహిళా స్థానాలు ఏకగ్రీవం, పురుషులకు ఎలక్షన్లు. జనగామ మండలం ఎల్లంల శ్రీ పద్మవంశీ జీహెచ్‌డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీలో మహిళా స్థానాలు ఏకగ్రీవం, పురుషులకు ఎలక్షన్లు. కొడకండ్ల మండలం శ్రీ శ్రీనివాస పవర్లూమ్ డబ్ల్యూసీఎస్ లిమిటెడ్ సొసైటీలో 9 నామినేషన్లు రాగా పాలకవర్గం ఏకగ్రీవమయ్యారు.
మొత్తం 163 నామినేషన్లు రాక
నాలుగు ఏకగ్రీవం, ఐదు సొసైటీల్లో
మహిళలు కూడా..
8 సొసైటీల్లో ఎన్నికలు
నేడు పరిశీలన, అనంతరం
అధికారిక ప్రకటన


