ఇలా ఉంటే..బడికి ఎలా వచ్చేది? | - | Sakshi
Sakshi News home page

ఇలా ఉంటే..బడికి ఎలా వచ్చేది?

Jul 4 2026 2:43 AM | Updated on Jul 4 2026 2:43 AM

జనగామ రూరల్‌: మండలంలోని ఎల్లంల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అధ్వానంగా ఉంది. పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెపుతున్నా ఇక్కడ అందుకు విరుద్ధంగా ఉంది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉండగా మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. పాఠశాల మైదానంలో పిచ్చిమొక్కలు పాములు వచ్చే అవకాశం ఉంది. దీంతో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శికి విద్యార్థులు, తల్లిదండ్రులు తెలియజేసినప్పటికి ఫలితం లేదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నారు.

ఇంటర్వ్యూలు షురూ

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని పార్ట్‌టైం అధ్యాపకుల నియమాకాలకు ఇంటర్వ్యూలు శుక్రవారం ప్రారంభించారు. తొలిరోజు లా, సొషియాలజీ, సైకాలజీ, లైబ్రరీ సైన్స్‌ విభాగాల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరిగాయి. డెమోలు నిర్వహించారు. ఈ ప్రక్రియను కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం పర్యవేక్షించారు. ఈ ఇంటర్వ్యూల ప్రక్రియ రోజుకు పలు విభాగాల్లో ఈనెల 8వ తేదీ వరకు కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement