సమస్యలున్నయ్‌ ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

సమస్యలున్నయ్‌ ‘సర్‌’

Jul 4 2026 2:43 AM | Updated on Jul 4 2026 2:43 AM

మాజీ సర్పంచ్‌ ఓటుకే మ్యాపింగ్‌ కరువు

– 8లోu

జనగామ: జిల్లాలో ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయి. బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి ఫారాలు పంపిణీ చేస్తున్నా, వాటిని ఎలా నింపాలి? ఏ వివరాలు నమోదు చేయాలి? అనే విషయంపై ఓటర్లకు పూర్తి అవగాహన లేకపోవడంతో నిరక్షరాస్యులు, వృద్ధులు, గిరిజన తండాల ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ఫారాలు అందించిన తర్వాత వాటిని నింపే విధానంపై సరైన సూచనలు ఇచ్చేవారు లేరు. బీఎల్‌ఓలే స్వయంగా ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తుండగా, రైతులు, వ్యవసాయ కూలీలు ఖరీఫ్‌ పనుల్లో నిమగ్నమై ఉండడంతో ఫారాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం కనిపిస్తోంది. వలస వెళ్లిన వారు, అందుబాటులో లేని ఓటర్ల కారణంగా సేకరణ ఆలస్యమవుతోంది.

కష్టంగా వివరాల నమోదు

అన్ని మండలాల్లోనూ ప్రధానంగా 2002 నాటి ఓటరు జాబితా వివరాలు నమోదు చేయడమే పెద్ద సమస్యగా మారింది. పాత ఓటరు జాబితాలు అందుబాటులో లేకపోవడం, ఎన్‌వీఎస్‌పీ యాప్‌లో కొందరి పేర్లు కనిపించకపోవడం, అప్పటి నియోజకవర్గం, పోలింగ్‌ కేంద్రం వివరాలు గుర్తించడం కష్టంగా మారింది. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం ఎంపికలో కూడా చాలామంది అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు బీఎల్‌ఓలు రోజంతా వందలాది ఫోన్‌కాల్స్‌కు సమాధానాలు చెప్పాల్సి రావడం అదే సమయంలో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాల్సి రావడంతో పనిభారం పెరిగింది. అధికారులు లక్ష్యాలు పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకురావడంతో బీఎల్‌ఓలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కొన్ని మండలాల్లో బీఎల్‌ఓలే స్వయంగా ఫారాలు నింపి నిరక్షరాస్యులకు సహకరిస్తుండగా, చదువుకున్న యువకులు, విద్యార్థులు, రాజకీయ పార్టీలు కూడా తెలియని ఓటర్లకు అండగా నిలుస్తున్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సజావుగా సాగాలంటే విస్త్రృత అవగాహన కార్యక్రమాలు, పాత ఓటరు జాబితాల సులభ లభ్యత, సాంకేతిక సమస్యల పరిష్కారం అవసరం.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు క్షేత్రస్థాయిలో పరీక్ష

ఫారం నింపడంలో ఇబ్బందులు

నిరక్షరాస్యులు, వృద్ధులు, గ్రామీణులకు కష్టమే

బీఎల్‌ఓలనే ఫారం నింపాలంటూ

వేడుకోలు

ఫారంల పంపిణీ, ఆన్‌లైన్‌ పనులతో బీఎల్‌ఓల సతమతం

జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్‌, ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌

నియోజకవర్గం మ్యాపింగ్‌ డిజిటలైజేషన్‌ ఫారాలు పంపిణీ

జనగామ 92.24 2,836 2,49,437 2,20,588

స్టే.ఘన్‌పూర్‌ 93.81 5,661 2,56,806 2,39,396

పాలకుర్తి 94.18 9,681 2,61,241 2,17,710

పిట్టలోనిగూడెంలో 80 మందికి పైగా

ఇదే పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement