ఏఎంసీలో స్వచ్ఛత పనులు | - | Sakshi
Sakshi News home page

ఏఎంసీలో స్వచ్ఛత పనులు

Jul 4 2026 2:43 AM | Updated on Jul 4 2026 2:43 AM

జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ) యార్డులోని ఐకేపీ పత్తి కొనుగోలు కేంద్రాల్లో పేరుకపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఏఎంసీ సిబ్బంది శుభ్రత పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు విస్తృతంగా సేవలు అందించామని, మార్కెట్‌ యార్డులో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి జిల్లాలో అత్యధికంగా వరి కొనుగోళ్లు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ సిబ్బంది ఆయిలయ్య, వెంకటేష్‌, రమేశ్‌, కృష్ణ, కుమారస్వామి, ప్రవీ ణ్‌, ఉమా మహేశ్వరి, కోమలత పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

జనగామ రూరల్‌: ఐదో తరగతి ఉత్తీర్ణులైన బా లికలకు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో ఏర్పాటు చేసిన ఐఓఈ(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) సెంటర్లలో 6వ తరగతి నుంచే ప్రత్యేక కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు కేజీవీబీ జిల్లా స్పెషల్‌ ఆఫీ సర్‌ అన్నపూర్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. ఐవోఈ సెంటర్లలో అనుభవజ్ఞులై న ఉపాధ్యాయులచే బోధన అందించడంతో పాటు, జేఈఈ, నీట్‌, క్లాట్‌ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కోసం నిపుణులైన అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నా రు. జిల్లాలోని చౌడారం, పాలకుర్తి, ఘన్‌పూర్‌ స్టేషన్‌ కేజీవీబీ ఐఓఈ సెంటర్లలో ప్రవేశాల కోసం 5వ తరగతి ఉత్తీర్ణులైన బాలికలు మాత్ర మే అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి గల విద్యార్థినులు జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు సంబంధిత కేజీవీబీల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రవేశ పరీక్షను జూలై 12న నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కేజీబీవీలో విద్యార్థినులకు అవగాహన

చిల్పూరు: వసతి గృహాల్లో ఉంటూ చదివే విద్యార్థినులు ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే 100కు డయల్‌ చేయాలని వెస్ట్‌ జోన్‌ డీసీపీ రాజమహేందర్‌నాయక్‌ సూచించారు. మండలంలోని రాజవరం గ్రామ పంచాయతీ పరిధిలోని కేజీబీవీలో శుక్రవారం ఎస్సై నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించగా డీసీపీ హాజరయ్యారు. ఈసందర్భంగా భద్రత, పలువిషయాలపై విద్యార్థినులకు అర్ధం అయ్యే రీతిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌వో స్వప్న, 200 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. కాగా, చిల్పూరు పోలీస్‌ స్టేషన్‌ను డీసీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.

5న విరసం ఆవిర్భావ సభ

జనగామ రూరల్‌: దేశంలో ప్రజా ఉద్యమాలపై అమలవుతున్న ఫాసిస్ట్‌ నిర్బంధం, అణిచివేతకు వ్యతిరేకంగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో పోరాటం కొనసాగింపుగా జూలై 5న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విప్లవ రచయితల సంఘం ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్‌ జిల్లా విర సం కన్వీనర్‌ కోడం కుమారస్వామి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..దేశంలో ఫాసిజం ప్రత్యేకతలు, అంశంపై కవి రివేరా, ‘బుల్డోజర్‌ రాజకీయాలు మతమైనారిటీల అస్తిత్వంపై దాడ్ఙి, గురించి ఎడిటర్‌ ఎన్‌.వేణుగోపాల్‌, ‘తెలుగు సాహిత్యంలో ఇటీవల ధోరణులు – మార్క్సిస్ట్‌ దృక్పథం’ అనే అంశం ప్రొఫెసర్‌ చింతకింది కాశీం ఉపన్యాసాలు ఉంటాయని తెలిపారు. సభలకు కవులు, రచయితలు, మేధావులు, విద్యార్థులు భారీసంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.

గంజాయి, గుడుంబా

నిర్మూలనకు నిరంతర నిఘా

జనగామ: జిల్లాలో గంజాయి, గుడుంబా నిర్మూలనకు నిరంతరం నిఘా, ఆకస్మిక దాడులు కొనసాగుతాయని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి (డీపీఈఓ) నంద్యాల అంజిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని మూడు ఎకై ్సజ్‌ సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక బృందాలతో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి రవాణా, విక్రయాలు, గుడుంబా తయారీ, కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రజలు కూడా గంజాయి విక్రయాలపై అప్రమత్తంగా ఉండి సంబంధిత సమాచారం ఎకై ్సజ్‌ శాఖకు అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement