ఒకే దరఖాస్తు.. బహుళ కనెక్షన్లు | - | Sakshi
Sakshi News home page

ఒకే దరఖాస్తు.. బహుళ కనెక్షన్లు

Jul 4 2026 2:43 AM | Updated on Jul 4 2026 2:43 AM

సేలను సద్వినియోగం చేసుకోండి

జనగామ: విద్యుత్‌ వినియోగదారులకు మరింత వేగవంతమైన, సులభమైన, పారదర్శక సేవలను అందించేందుకు టీజీఎన్పీడీసీఎల్‌ ‘బల్క్‌/మల్టిపుల్‌ అప్లికేషన్‌ రిజిస్ట్రేషన్‌’ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లకు అవసరమైన బహుళ విద్యుత్‌ కనెక్షన్లను ఒకే దరఖాస్తుతో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటివరకు ప్రతీ విద్యుత్‌ కనెక్షన్‌కు విడివిడిగా దరఖాస్తు చేయాల్సి ఉండగా, కొత్త విధానంలో ఒకే దరఖాస్తుతో అన్ని కనెక్షన్ల ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో బిల్డర్లు, డెవలపర్లు, భవన యజమానులు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు తక్కువ సమయంలోనే విద్యుత్‌ కనెక్షన్లు పొందే వీలుంటుంది. కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో పాటు, దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌకర్యం కూడా కల్పించారు. అపార్ట్‌మెంట్లు, మల్టీ స్టోర్‌డ్‌ భవనాలు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లకు అవసరమైన ఎల్‌టీ కేటగిరీ–1, కేటగిరీ–2 విద్యుత్‌ కనెక్షన్లకు ఈ విధానం వర్తిస్తుంది. మొత్తం కాంట్రాక్ట్‌ లోడ్‌ ఆధారంగా చార్జీలు నిర్ణయించబడతాయి. 20 కిలోవాట్ల వరకు డెవలప్‌మెంట్‌ చార్జీలు, సర్వీస్‌ లైన్‌ చార్జీలు వర్తించగా, 20 కిలోవాట్లకు మించి కేవలం సర్వీస్‌ లైన్‌ చార్జీలు మాత్రమే వసూలు చేస్తారు. ఒక కిలోమీటర్‌ పరిధిలో ఉన్న విద్యుదీకరణ నెట్‌వర్క్‌ నుంచి ఓవర్‌ హెడ్‌ లైన్లకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్‌ను డిస్కం అదనపు వ్యయం లేకుండానే ఏర్పాటు చేయనుంది. అప్లికేషన్‌ నమోదు సమయంలోనే సర్వీస్‌ లైన్‌చార్జీలను పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన పూర్తైన వెంటనే కనెక్షన్ల మంజూరు ప్రక్రియను వేగంగా పూర్తి చేయనున్నారు. వినియోగదారులు టీజీఎన్పీ డీసీఎల్‌ అధికారిక పోర్టల్‌ ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 1912 లేదా 1800–425–0028 టోల్‌ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని విద్యుత్‌ శాఖ సూచించింది.

బల్క్‌/మల్టిపుల్‌ అప్లికేషన్‌ రిజిస్ట్రేషన్‌ విధానంతో అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ లకు విద్యుత్‌ కనెక్షన్ల మంజూరు మరింత వేగవంతం అవుతుంది. వినియోగదారులు ఈ ఆన్‌లైన్‌ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని ఒకే దరఖాస్తుతో బహుళ కనెక్షన్లు పొందాలని కోరుతున్నాం.

–సంపత్‌రెడ్డి, ఎస్‌ఈ, ఎన్పీడీసీఎల్‌

విద్యుత్‌ సేవలు మరింత సులభతరం

అపార్ట్‌మెంట్లు,

కమర్షియల్‌ కాంప్లెక్సులకు శుభవార్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement