డీఎఫ్‌ఓ ముకుందరెడ్డి బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

డీఎఫ్‌ఓ ముకుందరెడ్డి బాధ్యతల స్వీకరణ

Jul 3 2026 1:16 AM | Updated on Jul 3 2026 1:16 AM

న్యూశాయంపేట : హనుమకొండ, జనగామ జిల్లాల అటవీశాఖాధికారిగా జి.ముకుందరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను హనుమకొండ రేంజ్‌ అధికారులు టి.శ్రీనివాస్‌, జె.శిరీష, కాకతీయ జూపార్క్‌ అసిస్టెంట్‌ క్యూరేటర్‌ బి.మయూరి, పరిపాలన అధికారి పి.మంజుల, సిబ్బంది రాజు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

రూ.13 లక్షలతో తూము, మత్తడి మరమ్మతు

రఘునాథపల్లి: మండలంలోని ఇబ్రహీంపూర్‌ పెద్ద చెరువును నీటి పారుదల శాఖ ఎస్‌ఈ సీతారాంనాయక్‌ గురువారం సందర్శించారు. మాజీ జెడ్పీటీసీ, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, సర్పంచ్‌ పోకల శ్రీనివాస్‌, రైతులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో చెరువును పరిశీలించారు. తూము వద్ద లికేజీలు ఎక్కడ ఉన్నాయో పరిశీలించారు. తూము మరమ్మతు, మత్తడి వద్ద దెబ్బతిన్న భాగాల పునరుద్ధరణ, కట్టపై చెట్ల తొలగింపు, కట్టలపై గుంతల మరమ్మతు కోసం రూ.13లక్షలు మంజూరైనట్లు త్వరలో పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

ఆలయానికి రూ.20లక్షల విరాళం

బచ్చన్నపేట : మండలంలోని రామచంద్రాపురం గ్రామంలోని శ్రీ శివసీతారామాంజనేయస్వామి దేవాలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన మారోజు సత్యనారాయణ–స్వాతి దంపతులు, వారి కుమార్తెలు హరిప్రియ, గాయత్రితో కలిసి సుమారు రూ.20 లక్షల విలువైన విరాళాన్ని గురువారం అందజేశారు. దేవాలయం కోసం టేకు ద్వారబంధాలు, రాతి ద్వారబంధాలు, టేకు తలుపులు, రాతి శేరేలు, పంచలోహ ఉత్సవ విగ్రహాలు, శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాలతో పాటు ఆలయానికి అవసరమైన పలు సామగ్రిని సమర్పించారు. బంధుమిత్రుల సహకారంతో ఈ విరాళాన్ని అందించినట్లు దాతలు తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం

జనగామ: జిల్లా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాల (టీఎంఆర్‌ఎస్‌) జనగామ బాలుర–1, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాల, జూనియర్‌ కళాశాల (టీఎంఆర్‌ఎస్‌,జేసీ) స్టేషన్‌ ఘన్‌పూర్‌ బాలికల–1లో 2026–27 విద్యా సంవత్సరానికి 5, 6, 8వ తరగతుల్లో ఏర్పడిన ఖాళీ సీట్ల భర్తీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాలకు చెందిన మైనారిటీయేతర విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మురళీధర్‌రావు గురువారం తెలిపారు.

ఖాళీలు ఇలా..

గురుకులాల్లో చేరాలనుకునే ఆసక్తి గల విద్యార్థులు కులం, ఆదాయం, విద్యా అర్హత ధ్రువపత్రాల జిరాక్స్‌ ప్ర తులతో కలిసి ఈనెల 6లోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ బాలికల–1 గురుకులంలో 5వ తరగతిలో బీసీ–3, ఎస్సీ–3, ఓసీ–2, 6వ తరగతిలో బీసీ–1, 8వ తరగతిలో ఎస్టీ–1, ఓసీ –1 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. జనగామ బాలుర–1 గురుకులంలో 5వ తరగతిలో బీసీ–3, ఓసీ–1, 6వ తరగతిలో ఓసీ–2 ఖాళీలు ఉన్నాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement