ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దేవరుప్పుల మండలంలోని మాదాపురం గ్రామంలో మహిళా వ్యవసాయ కూలీలతో కలిసి వరి నాటు వేశారు. గ్రామంలో అధికారిక కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో పొలంలో మహిళా కూలీలు వరి నాట్లు వేస్తుండడం గమనించిన ఎమ్మెల్యే వెంటనే వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. కొంతసేపు వారితో కలిసి స్వయంగా వరి నాట్లు వేస్తూ వ్యవసాయ పనిలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే తమతో కలిసి పొలంలోకి దిగి నాట్లు వేయడంతో మహిళా కూలీలు ఆనందం వ్యక్తం చేశారు.
–పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల)


