● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
● పాలకుర్తి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ
పాలకుర్తి టౌన్: చదువే భవిష్యత్‌కు బలమైన పునాది అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా 8వ తరగతికి వెళ్లి ఇంగ్లిష్ పాఠ్యాంశాలను విద్యార్థులతో చదివించి విద్యార్థుల అభ్యాసన సామర్‌ాధ్యలు పరిశీలించారు. వసతి సౌకర్యాలు, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజనం, సైన్స్ ల్యాబ్, వైద్య సేవలు, వంటశాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో విధ్యాశాఖ ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీఓ వేదవతి, ఎంఈఓ పోతుగంటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
‘సర్’ను పారదర్శకతతో నిర్వహించాలి
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తిస్ధాయిలో పారదర్శకతతో, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో శాంతినగర్‌లో ఇంటింటి సర్వేను ఆకస్మింగా పరిశీలించిన కలెక్టర్ ఓటర్ల వివరాలను స్వయంగా ఽతెలుసుకున్నారు. బీఎల్‌ఓలు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పని చేయాలని, అవసరమైన సాంకేతిక శిక్షణ అందించాలని తహసీల్దార్ సరస్వతిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎండీడీఓ వేదవతి, సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.


