జన జీవనంలోకి జాతీయ పక్షి | - | Sakshi
Sakshi News home page

జన జీవనంలోకి జాతీయ పక్షి

Jul 2 2026 2:17 AM | Updated on Jul 2 2026 2:17 AM

జనగామ: జనగామ పట్టణంలోని సంజయ్‌నగర్‌లో జనావాసాల మధ్య చిక్కుకున్న జాతీయ పక్షి నె మలిని అటవీశాఖ అధికారులు సురక్షితంగా రక్షించి రఘునాథపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు. జనగామ అమ్మ ఫౌండేషన్‌ టీం సభ్యుడు ఎండీ అజిత్‌ నెమలి చిక్కుకున్న విషయాన్ని గుర్తించి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్‌కు తెలిపారు. ఆయన అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో, జనగామ అటవీ క్షేత్రాధికా రి భాస్కర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి నెమలికి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా రక్షించి రఘునాథపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు. అడవి జంతువులు, పక్షులు జనావాసాల్లో కనిపించినప్పుడు తమకు సమాచారం అందించాలని అటవీశాఖ అధికారి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement