జర్మనీ వర్సిటీలతో కేయూ ఎంఓయూ | - | Sakshi
Sakshi News home page

జర్మనీ వర్సిటీలతో కేయూ ఎంఓయూ

Jul 2 2026 2:17 AM | Updated on Jul 2 2026 2:17 AM

కేయూ క్యాంపస్‌: ఉన్నత విద్యాశా ఖ అధికారులు, వివిధ యూనివర్సి టీల వీసీలు, ప్రొఫెసర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్‌ కళా శాలల లెక్చరర్లు ఎడ్యుకేషన్‌ స్టడీ టూర్‌కు జర్మనీ వెళ్లారు. జర్మనీ ప ర్యటనకు వెళ్లిన బృందంలో ఉన్న కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అక్కడ మూడు యూనివర్సిటీలతో కేయూకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఈమేరకు బుధవారం వివరాలను వెల్ల డించారు. ఆయా విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ సంబంధాల విభాగాల అఽధిపతులతో వీసీ ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యోగితారాణా, రూసా ప్రాజెక్టు అధికారి సౌందర్యజోసెఫ్‌, రూసా కేయూ నోడల్‌ అధికారి ప్రొఫెసర్‌ ఆర్‌.మల్లికార్జున్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎం.కుమార్‌ చర్చలు జరిపారు. అనంతరం ఎంఓయూ కుదుర్చుకున్నారు. జర్మనీ పర్యటనలో ఆయన ఈనెల 6 వరకు ఉండనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement