● సీపీఐ జల్లా కార్యదర్శి రాజారెడ్డి
జనగామ రూరల్: పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటి ప్రజల ఇంటి కల నెరవేరుస్తామన్న తమ హామీని మరచి, ప్రభుత్వ స్థలాల్లోని గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకున్న పేదల ఇళ్లను రాత్రికిరాత్రే తొలగించి ప్రజలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇల్లు లేని పేదలకు ఇంటిని నిర్మించడం ప్రభుత్వం బాధ్యతన్నారు. రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో 30 మంది దళితులు డబుల్ బెడ్ రూమ్‌లో నివసిస్తున్నప్పటికీ, వారికి కరెంటు, మంచినీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మౌలిక వసతులు కల్పించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న, పట్టణ కార్యదర్శి సొప్పరి సోమయ్య, కావటి యాదగిరి, చెల్లోజు మల్లేశం, రావుల సదానందం, మొటే శ్రీశైలం, ఎండీ యూనస్, కందుకూరి మల్లేశం, పిట్టల కుమార్, ఐలయ్య, దయా నగేష్, మహిళా సంఘం జిల్లా అ ధ్యక్ష కార్యదర్శులు, యాదలక్ష్మి, ఎండీ నూర్నిషా, బిజిగం ఎల్లయ్య, పుప్పాల ఐలయ్య, ఎండీ యా కూబ్ పాషా, సింగరయ్య తదితరులు పాల్గొన్నారు.


