ఐఎంఏ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం | - | Sakshi
Sakshi News home page

ఐఎంఏ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Jul 2 2026 2:17 AM | Updated on Jul 2 2026 2:17 AM

జనగామ: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో జనగామ ఐఎంఏ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఐఎంఏ జనగామ అధ్యక్షుడు డాక్టర్‌ జె.బాలాజీ, కార్యదర్శి డాక్టర్‌ ఎ.శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో వైద్యులు, సామాజిక సేవకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ వైద్య సేవలతో పాటు సామాజిక బాధ్యతను నిర్వర్తించడం ప్రతీ వైద్యుడి కర్తవ్యమన్నారు. డాక్టర్లు బాలాజీ, శ్రీకాంత్‌, రంజిత్‌, స్వప్న రాథోడ్‌, రజిని, విఘ్నశ్రీ, దివ్య, గోపిచంద్‌, సృజన్‌ సహా పలువురు ఐఎంఏ వైద్యులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ వైద్యులు డి.లవకుమార్‌ రెడ్డి, సీహెచ్‌ రాజమౌళి, లక్ష్మీనారాయణ నాయక్‌, కరుణాకర్‌ రాజు, సామా జిక సేవకులు కన్న పరశురాములు, తదితరులు పాల్గొన్నారు. కాగా శిబిరంలో 25 యూనిట్ల రక్తాన్ని సేకరించి జనగామ ప్రభుత్వ ఆస్పత్రి రక్తనిధికి అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement