విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి

Jul 2 2026 2:17 AM | Updated on Jul 2 2026 2:17 AM

బచ్చన్నపేట: ఉపాధ్యాయులు బాధ్యతతో వ్యవహరించి విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర అబ్జర్వర్‌ సీహెచ్‌.వీ.ఎస్‌. జ నార్దన్‌ రావు అన్నారు. బుధవారం మండలకేంద్రంలో ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, పా ఠశాల పనితీరు, అడ్మిషన్‌ ప్రక్రియ, విద్యాబోధన, రికార్డులను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చదువుకునే విద్యార్థులకు పేదరికం అడ్డుకాకూడదని అనేక రకాల సౌకర్యాలను కల్పింస్తుందన్నారు. ఉపాధ్యాయులు సరి గా పాఠాలు చెప్పకపోయినా, మెనూ ప్రకారం మ ధ్యాహ్న భోజనం లేకపోయినా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా అబ్జర్వర్‌ నాగరా జు, ఎంఈఓ ఇర్రి వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ భారతి దేవి, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యాశాఖ రాష్ట్ర అబ్జర్వర్‌

వీ.ఎస్‌. జనార్దన్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement