కొనుగోళ్లలో కొత్త చరిత్ర | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లలో కొత్త చరిత్ర

Jul 1 2026 12:52 AM | Updated on Jul 1 2026 12:52 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026

దండిగా ధాన్యం..

జనగామ: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జిల్లా మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. 2025–26 యాసంగి సీజన్‌న్‌లో జిల్లాలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా 2లక్షల49మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. మొత్తం 36,056 మంది రైతులు తమ పంటను ప్రభుత్వానికి విక్రయించగా, వారికి రూ.575.36 కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మరో రూ.20.56 కోట్ల చెల్లింపులు త్వరలో విడుదల కానున్నాయి. జిల్లాలో వరి సాగు 2లక్షల విస్తీర్ణం పెరగడం, అనుకూల వాతావర ణం, ఆశించిన దిగుబడులు రావడం, కొనుగోలు కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేయడం వంటి కారణాలతో ఈసారి కొనుగోళ్లు రికార్డు స్థాయికి చేరాయి.

కలెక్టర్‌ ప్రత్యేక చొరవ

జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ప్రత్యేక పర్యవేక్షణతో సజావుగా సాగాయి. కొనుగోలు కేంద్రాలను నిత్యం పరిశీలిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకునేలా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాల సమయంలో ధాన్యం తడిసిపోకుండా తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. రైతులు కేంద్రాల వద్ద ఎక్కువ రోజులు నిరీక్షించకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేశారు.

373 కొనుగోలు కేంద్రాలు

ఈ యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సన్న, దొడ్డురకం కలిపి 373 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో దొడ్డు రకాల ధాన్యం కోసం 234 కేంద్రాలు, సన్న రకాల ధాన్యం కోసం 139 కేంద్రాలు పనిచేశాయి.

ప్రతీ సీజన్‌ లో పెరిగిన కొనుగోళ్లు

2024–25 వానాకాలంలో 21,992 మంది రైతుల నుంచి 91,043.120 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.211.21 కోట్లను చెల్లించారు. అదే ఏడాది యాసంగిలో 29,672 మంది రైతుల నుంచి 1,66,707.760 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.386.66 కోట్లను జమ చేశారు. అనంతరం 2025–26(ప్రస్తుతం) యాసంగిలో కొనుగోళ్లు మరో స్థాయికి చేరుకుని 2.49 లక్షల మెట్రిక్‌ టన్నుల మార్కును దాటాయి. గత యాసంగితో పోలిస్తే సుమారు 82వేల737 మెట్రిక్‌ టన్నుల అదనపు ధాన్యం కొనుగోలు కావడం జిల్లాలో వరి ఉత్పత్తి పెరుగుదలకు నిదర్శనంగా నిలిచింది.

మూడు సీజన్లలో భారీ కొనుగోళ్లు

2024–25 వానాకాలం నుంచి 2025–26 యాసంగి వరకు జిల్లాలో మొత్తం 5,07,195.850 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 87,720 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందుకు రూ.1,173.23 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ధాన్యం కొనుగోలు విధానం, కేంద్రాల సమర్థ నిర్వహణ, వేగవంతమైన చెల్లింపులతో జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలిచింది.

రికార్డు స్థాయిలో 2.49 లక్షల

మెట్రిక్‌ టన్నుల సేకరణ

గత యాసంగితో పోలిస్తే

82,737 మెట్రిక్‌ టన్నులు అదనం

36,056 మంది రైతుల నుంచి

కొనుగోలు

రూ.575.36 కోట్ల చెల్లింపులు

కలెక్టర్‌ ప్రత్యేక చొరవ..

పెరిగిన కొనుగోళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement