పాలకుర్తి టౌన్(దేవరుప్పుల): ఎస్‌ఐఆర్ (సర్) ప్రక్రియను పారదర్శకంగా, క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. దేవరుప్పుల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఆయనతో తహసీల్దార్ అహ్మద్, ఇతర సంబంధిత అధికారులు, బూత్ లెవల్ అధికారులు ఉన్నారు.
తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలి
ఉన్నత ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విద్యార్థులకు సూచించారు. దేవరుప్పుల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యాబోధన, వసతి, ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు. పదో తరగతిలో అన్‌అకాడమీ ఉచిత డిజిటల్ తరగతులను కలెక్టర్ ప్రారంభించి, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 6వ, 8వ, 9వ తరగతుల గదులను సందర్శించి, విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.
బడిబాట లక్ష్య సాధనకు సమష్టి కృషి చేయాలి
జనగామ రూరల్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల నమోదు శాతాన్ని మరింత పెంచేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్, విద్యాశాఖ అధికారి సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో బడి బాట, అకడమిక్ ఫ్రేంవర్క్, అసెస్‌మెంట్ టూల్ కిట్, ఫాస్ట్ మ్యాథ్స్, తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 7,733 మంది విద్యార్థులు కొత్తగా నమోదు కావ డం సంతోషమన్నారు. ఫాస్ట్ మ్యాథ్స్ పుస్తకాలను ఉపాధ్యాయులు చదివి, అవగాహన పెంచుకొని, విద్యార్థులకు సులభంగా బోధించే విధంగా సిద్ధం కావాలని సూచించారు. విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం,ఎంఈఓలు, పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధికి సీఈఓ విశిష్ట సేవలు
జెడ్పీ సీఈఓ బి.రంగారావు జిల్లా అభివృద్ధికి ప్రజలకు అంకితభావంతో విశిష్ట సేవలు అందించారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సీఈఓ పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలో క్రమశిక్షణ, ప్రజల విశ్వాసాన్ని సంపాదించడం ప్రతి ఉద్యోగి జీవితంలో అత్యంత గొప్ప విజయమని తెలిపారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


