● స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
చిల్పూరు: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ఏమైనా సమస్యలుంటే పరిష్కరించే బాధ్యత తనదేనని ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. మండలంలోని వెంకటేశ్వరపల్లి, తీగలతండా, రాజవరం పంచాయతీ పరిధిలోని కేజీబీవీలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా కేజీబీవీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.. మెరుగైన విద్యనందించడంలో అధికారులు, ఉపాధ్యాయులు ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ఈవిషయంలో తాను ఏమాత్రం క్షమించనని అన్నారు. 35 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్ ప్రకాశ్, చిల్పూర్ ఆలయ, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు పొట్లపల్లి శ్రీధర్‌రావు, లావణ్యశిరీష్‌రెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీఓ కష్ణప్రసాద్, జీసీడీఓ గౌసియా, ఉపాధి హామీ ఏపీఓ మోహన్‌రావు, మండల విద్యాశాఖ అధికారి దాసరి గోవర్ధన్, కేజీబీవీ ఎస్‌వో స్వప్న, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


