స్టేషన్‌ఘన్‌పూర్: వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే బాట నుంచి రైతులను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్న రైతుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన వారాల రాజు అనే రైతు కలెక్టరేట్‌కు సోమవారం పాదయాత్ర చేపట్టారు. ముందుగా సమస్యపై ఇప్పగూడెం జీపీ కార్యాలయంలో వినతిపత్రం అందించి అక్కడి నుంచి పాదయాత్రగా స్టేషన్‌ఘన్‌పూర్ వెళ్లి తహసీల్దార్ కార్యాలయం, ఆర్‌డీఓ ఆఫీస్‌లో వినతిపత్రం అందించి కలెక్టరేట్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. గ్రామంలోని 23, 24 సర్వేనంబర్లలో 80 సంవత్సరాల నుంచి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేందుకు దారి ఉందని, జిట్టెబోయిన వెంకటయ్య అనే రైతు తన స్వప్రయోజనాల కోసం ఆ దారిని అక్రమంగా మూసివేసి రైతులను వెళ్లకుండా అడ్డుకుంటున్నాడన్నారు. ఈ విషయమై కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని, అప్పటికీ న్యా యం జరగనట్లయితే హైదరాబాద్ సెక్రటేరియట్‌కు వెళ్తానని స్పష్టం చేశారు. ఆయన వెంట రైతులు తోట రాజు, బక్క రాంచంద్రు, నవీన్, అనీల్, వెంకటయ్య ఉన్నారు.


