జనగామ: ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా నాలుగు మండలాల తహసీల్దార్ కార్యాలయాలకు పక్కా భవనాల నిర్మాణం కోసం పరిపాలనా అనుమతి వచ్చిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు, ప్రభుత్వానికి వినతి చేయడంతో తరిగొప్పుల, కొమురవెల్లి, దూల్మిట్ట, మద్దూరు మండల కేంద్రాల్లో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందన్నారు. ఒక్కో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మా ణానికి రూ.2.25 కోట్ల చొప్పున మొత్తం రూ.9 కోట్లు కేటాయించిందన్నారు. నూతన భవనాల నిర్మా ణం పూర్తయిన తర్వాత ప్రజలకు సేవలు మరింత వేగంగా అందడంతో పాటు ఉద్యోగులకు కూడా మెరుగైన పని వాతావరణం ఏర్పడనుందన్నారు.
నిర్మాణాలకు రూ.9కోట్ల
పరిపాలనా అనుమతి
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి


